Back

President Message

img



నా పేరు జయప్రకాశ్ ఇంజపురి. ఇటీవలే అంగరంగవైభవంగా స్వర్ణోత్సవాలు జరుపుకున్న యాభై ఏళ్ల చరిత్ర కలిగిన తొలి తెలుగువారి సంస్థ తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘానికి 42 వ అధ్యక్షుడి గా బాధ్యతలు స్వీకరించాను. సంస్థ ఆశయాల సాధనకు ఈ నూతన సంవత్సరం ఒక చక్కని అవకాశం.

2022 వ సంవత్సరాన్ని ఆశావహదృక్పథంతో స్వాగతం పలుకుదాం. టి. ఎల్. సి. ఏ. సభ్యులకు, శ్రేయోభిలాషులకు, దాతలకు, మరియు గత యాభై ఏళ్ళుగా తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం కీర్తిని దశదిశలా వ్యాపింపచేసేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. టి. ఎల్. సి. ఎ. పూర్వ అధ్యక్షులు, కార్యవర్గం, నూతన కార్యవర్గం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, కార్యకర్తలు, మరియు సభ్యులందరికీ మా నూతన కార్యవర్గ బృందం (2022) తరుపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో హృదయపూర్వక నమస్సుమాంజలి. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం లక్ష్య సాధనకి కృషి చేద్దామని పిలుపునిస్తున్నాను.

టి. ఎల్. సి. ఏ. 51 వ సంవత్సరంము నూతన అధ్యక్షుడి గా నేను, ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యులు ఎన్నిక కావడం యాదృచ్చికమే అయినా, ఈ అవకాశం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. సమర్థవంతమైన కార్యవర్గ బృందం దొరకడం, అధ్యక్షుడిగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో, మనం సంప్రదాయంగా చేసుకొనే సంక్రాంతి, ఉగాది, మరియు దసరా/దీపావళి పండుగలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన, విభిన్నమైన అనేక రకాల కార్యక్రమాలను మీ ముందుకు తీసుకువస్తామని నేను మరియు మా కార్యవర్గం హామీ ఇస్తున్నాము.

ముఖ్యమైన కార్యక్రమాల ప్రణాళిక:

  • మనం జరుపుకొనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేయడం.
  • మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాష, కళలలోని మాధుర్యాన్ని అందరికీ పంచేలా కార్యక్రమాలని రూపొందించటం. అందులో భాగంగా ఇక్కడ ఉన్న కళాకారులకు (లోకల్ టాలెంట్)కు ప్రాధాన్యత ఇవ్వడం.
  • భావితరాలకు ఉపయోగపడేలా, మన యువత అభ్యున్నతికి తోడ్పడే సాంకేతిక విద్య, మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించే కార్యక్రమాలని ఏర్పాటు చేయడం.
  • ఆరోగ్యమే మహాభాగ్యం. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా క్రొత్తగా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు (వివిధ వయస్సుల వారికి), 5K/10K రన్నింగ్, ఫ్యామిలీ క్విజ్ పోటీలు ఏర్పాటు చేయడం.
  • పాఠశాల విద్యార్థుల కొరకు రోబోటిక్స్ తరగతులు, మేథ్స్ ఒలింపియాడ్లు, రోబోటిక్స్ పోటీల నిర్వహణ.
  • మన తెలుగు సంఘ సభ్యులకు ఉపయోగపడేలా విద్య, వైద్య, ఆర్థిక, పన్నులు, సాంకేతిక, మరియు వినోద కార్యక్రమాలు ఏర్పాటు.
  • ప్రతి సంవత్సరం జరుపుకునే ఫాదర్స్ డే, మదర్స్డే, పిక్నిక్, పిల్లలకు వివిధ రకాల పోటీలు (Competitions), వేసవి కాలంలో క్రికెట్, టెన్నిస్, చెస్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా పోటీల నిర్వహణ.
  • మన పిల్లలలో తెలుగుభాష విజ్ఞానాన్ని పెంపొందించడానికి నూతనంగా “తెలుగు సాహితి సంఘం” (Telugu Sahithi Club) ఏర్పాటు.

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం నూతన కార్యవర్గం నూతన సంత్సరంలో నిర్దేశించుకున్న కార్యక్రమాలని అమలుపరచడానికి ఆర్ధికవనరులు మరియు సభ్యుల సహకారం ఎంతో అవసరం. గత 50 సంవత్సరాలుగా మన టి. ఎల్. సి. ఏ. కు అన్నివిధాలా అండదండగా ఉంటూ ఆర్ధిక సహాయం అందిస్తున్న గొప్ప దాతలందరికీ మా కార్యవర్గము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతోంది. ఈ ఏడాది కూడా మన టి.ఎల్.సి.ఏ. కి ఆర్ధిక సహాయం మరియు ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నాం.

“ఎందరో గొప్ప దాతలు, అందరికి మా వందనములు”

ఈ సంవత్సరంలో మేము నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని మా ఆత్మీయ ఆహ్వానం అందిస్తున్నాము. మా కార్యవర్గానికి అప్పగించిన గురుతర బాధ్యతను, మేమందరము కలిసి రాగద్వేషాలకు అతీతంగా త్రికరణ శుద్ధితో నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాము. మా నూతన కార్యవర్గంతో ఈ సంవత్సరం మొదటిగా నిర్వహించే “సంక్రాంతి” సంబరాలకు (జనవరి 16 వ తేదీన) మీరు మీ కుటుంబ సభ్యులు మరియు బందుమిత్రులతో కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.

భవదీయుడు
ఇంజపురి జయప్రకాశ్
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టి.ఎల్.సి.ఎ.)
నూతన అధ్యక్షుడు మరియు కార్యవర్గ బృందం 2022